{"effects_tried":0,"photos_added":0,"origin":"gallery","total_effects_actions":0,"remix_data":["add_sticker"],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"total_editor_time":86,"brushes_used":0,"total_draw_time":0,"effects_applied":0,"uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1582134484903","total_effects_time":0,"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1582134484914","sources":["308732963140201"],"layers_used":0,"width":1242,"height":649,"subsource":"done_button"}

మండలంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయంలో జరగనున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని TSRTC రామప్పకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు బుధవారం వరంగల్-2 డిపో మేనేజర్ భాను కిరణ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రీజియన్ పరిధిలోని వరంగల్-2 డిపో నుండి 10 బస్సులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. 21, 22 తేదీల్లో బస్సులు నడుస్తాయి. హన్మకొండ నుండి పెద్దలకు 100 పిల్లలకు 50 టికెట్ ధర నిర్ణయించినట్లు చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు, భక్తుల రద్దీ దృష్ట్యా మరిన్ని బస్సులు నడుపుతామని ఆయన స్పష్టం చేశారు. భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలని ఆయన కోరారు.

100 మంది పోలీసులతో బందోబస్తు:

మండలంలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయంలో ఈ నెల 21 నుండి 23 వరకు నిర్వహించనున్న శివరాత్రి జాతరకు 100 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు వెంకటాపూర్ ఎస్సై భూక్య నరహరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరలో నలుగురు ఎస్సైలు, ఇద్దరు సిఐలు విధులు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జాతర రోజుల్లో రామప్ప చెరువు కట్టకు వెళ్లేందుకు అనుమతి లేదని తెలిపారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తాత్కలిక హాస్పిటల్, క్యూ లైన్లను, వాహనాల పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.