మహా కూటమికి గుణపాఠం తప్పదు..

కాంగ్రెస్, టీడీపీ మహా కూటమికి తెలంగాణలో ప్రజలే గుణపాఠం చెప్తారని వరంగల్ పశ్చిమ తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. తెరాస అర్బన్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. గత నాలుగున్నరేళ్లలో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన పాలననే ప్రజలు కోరుంటున్నారని అన్నారు.

ఈ సందర్భంగా హన్మకొండ ఏనుగుల గడ్డకు చెందిన పలువురు కార్యకర్తలు తెరాసలో చేరారు.