విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌ మెడలో ఓ యువకుడు బలవంతంగా తాళికట్టిన ఘటన మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే:

Advertisement

విధులు నిర్వహిస్తున్న మహిళ కానిస్టేబుల్ పై ఓ యువకుడు బలవంతంగా మెడలో కట్టేశాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చోటుచేసుంది. ఇక వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తుంటుంది లెడీ కానిస్టేబుల్. అయితే రోజులాగే విధులకు హాజరైంది. అయితే జగిత్యాలకు చెందిన కుమారస్వామి అనే యువకుడు మహిళా కానిస్టేబుల్‌కు వరుసకు భావ అవుతాడు. 

కలెక్టర్ కార్యాలయానికి వచ్చినా కుమార్ ఆమెతో మాట మాట కలిపాడు. ఇంతలోనే తన జేబులో నుండి తాళి తీసి బలవంతంగా మహిళా కానిస్టేబుల్ మెడలో కట్టాడు. అనుకోని సంఘటనతో ఆ మహిళా కానిస్టేబుల్ నివ్వెరపోయింది. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.