మహిళా ఖైదీపై కానిస్టేబుల్ అత్యాచారాం..

ఓ కేసులో కోర్టుకు హాజరైన మహిళా ఖైదీపై కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ‌పశ్చిమ బెంగాల్‌లో ఆగస్టు 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం ఓ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న 42 ఏళ్ల మహిళను విచారణ నిమిత్తం పశ్చిమ బెంగాల్‌లోని ముుర్షీదాబాద్ కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరు మహిళా కానిస్టేబళ్లు, ఓ పురుష కానిస్టేబుల్ ఆమెకు గార్డులుగా ఉన్నారు. కోర్టు విచారణ అనంతరం గత శనివారం ఆమెను తీసుకుని తిరిగి ఢిల్లీ బయలుదేరారు. ఈ క్రమంలో ఖైదీ బాత్రూముకు వెళ్లిన సమయంలో మహిళా సిబ్బందిని వెనక్కి పంపి అతడు టాయిలెట్‌లో జొరబడి ఖైదీపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ఆమెను బెదిరించాడు. జైలుకు వెళ్లాక కానిస్టేబుల్ అఘాయిత్యాన్ని బాధితురాలు జైలు సూపరింటెండెంట్‌కు, జైలు వైద్యుడికి చెప్పడంతో విషయం వెలుగు చూసింది. వారి సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here