{"effects_tried":0,"photos_added":0,"origin":"gallery","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578752838965","total_editor_time":273,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578752838934","total_effects_time":0,"brushes_used":0,"height":826,"layers_used":0,"width":1242,"subsource":"done_button"}
  • రోడ్ సేఫ్టీ, ప్రమాదాల సంఖ్య తగ్గించడమే ఈ ఏడాది లక్ష్యం.
  • ప్రమాదాల ద్వారా జరిగే మరణాలను తగ్గించాలి.
  • ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించే చర్యలు చేపట్టాలి.

ఈ రోజు మెదక్ జిల్లా ఎస్పీ శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్ గారు రోడ్డు ప్రమాదాలు, మహిళా భద్రత, మరియు పి.డి. ఆక్ట్ పై జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించినారు. రోడ్డు ప్రమాదాలు, రోడ్ సేఫ్టీ అంశాలపై అదనపు ఎస్పీ, డిఎస్పీలు, సి.ఐ. మరియు ఎస్,ఐ.లతో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్.పి. గారు మాట్లాడుతు:

జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు మరింత శ్రద్ద వహించాలని ఆదేశించారు. మహిళా భద్రత, రోడ్ సేఫ్టీపై ఈ ఏడాది ప్రత్యేకమైన దృష్టి సారించి రోడ్డు ప్రమాదాల శాతం తగ్గించడం ప్రధాన లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ముఖ్యంగా జాతీయ రహదారులపై వేగాన్ని నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారులపై స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసే అవకాశం లేదని అందువల్ల దానికి ప్రత్యామ్నాయంగా తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించాలని చెప్పారు. జాతీయ రహదారులకు సమీపంలో ఉన్న అప్రోచ్ రోడ్లు, లింక్ రోడ్ల వద్ద ప్రమాదాల నివారణకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని ఇందుకు స్థానికంగా ఉండే అధికారులు ప్రజలతో సమన్వయం చేసుకుంటూ ప్రమాదాల సంఖ్య తగ్గే విధంగా చూడాలని తెలిపినారు.

అలాగే వాహనదారులు వాహనాన్ని డ్రైవ్ చేయటం నేర్చుకోవటం కన్నా ముందు, రోడ్డు సంకేతాల (సంజ్ఞల) గురించి తెలుసుకోవటం ఎంతో అవసరమని, సాధారణంగా, డ్రైవింగ్ నేర్చుకోవటానికి డ్రైవింగ్ స్కూల్‌కు వెళ్లినా లేదా లైసెన్స్ టెస్ట్ కోసం ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లినా వారు ముందుగా పరీక్షించేది మన డ్రైవింగ్ సరళిని కాదని, మనకు రోడ్ సైన్‌బోర్డుల విషయంలో ఎంత అవగాహన ఉందనేది పరీక్షించిన తర్వాతనే, ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్టును నిర్వహిస్తుంటారని తెలిపినారు. మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు నిత్యం అనేక రకాల రోడ్డు సంకేతాలను చూస్తుంటాం, అందులో కొన్ని దారి చూపేవైతే, మరికొన్ని సమాచారాన్ని అందించేవి, ఇంకొన్ని డ్రైవర్లను అప్రమత్తం చేసివిగా ఉంటాయి. ఇలాంటి సంకేతాలను రోడ్డుకు పక్కగా రాత్రివేళల్లో సైతం స్పష్టంగా కనిపించేలా రేడియం పెయింట్‌తో తయారు చేసిన వాటిని ఏర్పాటు చేస్తుంటారు.

  • ఇచ్చట పార్కింగ్ చేయరాదు,
  • ఇక్కడ కుడి/ఎడమ వైపుకు టర్నింగ్ లేదు,
  • నిర్ధిష్ట వేగానికి మించి వెళ్ల కూడదు,
  • ముందు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి,
  • అనవసరంగా హారన్ కొట్టరాదు,
  • ముందు రైల్వే ట్రాక్ ఉన్నది, ఇలా అనేక రకాల సైన్ బోర్డులను మనం గమనిస్తూ ఉంటాం.

ఇందులో కొన్ని తప్పనిసరి సంకేతాలు ఉంటాయి, వీటిని అతిక్రమిస్తే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించి, అందుకు తగిన జరిమానా విధించడం జరుగుతుందని కనుక ప్రతి యొక్క వాహనదారుడు ట్రాఫ్ఫిక్ నియమ నిబంధనలను అనుసరించి వాహనాలు నడిపితే చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపినారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రోడ్డు ప్రమాద క్షతగాత్రులు ముఖ్యంగా అధిక రక్తస్రావం జరిగి మరణాలు సంభవిస్తున్నాయని, రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు ప్రథమ చికిత్సలో భాగంగా రక్తస్రావ నివారణ చర్యలను చేపట్టాలని సిబ్బందికి సూచించారు.

ఇలా చేయడం వలన మరణాల శాతాన్ని తగ్గించవచ్చని తెలిపినారు. ప్రజల, వాహనదారుల ప్రాణాలు కాపాడడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉన్నదని చెప్పారు. స్పీడ్ బ్రేకర్స్, యాక్సిడెంట్స్ ప్రోన్ ఏరియాల, బ్లాక్ స్పాట్ ల వద్ద హెచ్చరికలు, సూచనలు చేసే బోర్డులను రేడియం స్టిక్కరింగ్ తో ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్.పి. శ్రీ డి.నాగరాజు గారు, మెదక్ డి.ఎస్.పి శ్రీ. కృష్ణమూర్తి గారు, మెదక్ జిల్లా సి.ఐ.లు ఎస్.ఐ.లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.