మహేశ్ బాబు కొత్త లుక్ కి అభిమానులు ఫిదా

మహర్షి సినిమాకోసం మీసం గడ్డం పెంచి రఫ్ లుక్ లో కనిపించిన మహేశ్ బాబు. ఇప్పుడు క్లీన్ షేవ్ లోకి మారిపోయాడు. జర్మనీలో ఫ్యామిలీతో కలసి పర్యటిస్తున్నారు. మహేశ్ తాజా లుక్ కి సంబంధించిన ఫొటోలను ఆయన భార్య నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే అవి వైరల్ గా మారాయి. మహేశ్ లుక్ అదుర్స్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ‘మహేశ్‌ ఎంత బాగున్నావ్‌, ఆయన‌ నుంచి చూపు తిప్పుకోలేకపోతున్నా, ఏం ఉన్నాడ్రా బాబూ, అన్నకి వయసు తగ్గిపోతోంది, ఆయనకు వయసు కేవలం ఓ సంఖ్య మాత్రమే, ఏంది సామీ ఆ లుక్‌, సర్‌ మీ వయసు ఎంత?’.

అంటూ తెగ కామెంట్లు చేశారు. ఈ ట్రిప్‌లో నమ్రత, గౌతమ్‌, సితార కలిసి దిగిన ఫొటోను మహేశ్‌ ఇన్‌స్టాగ్రామ్‌‌లో షేర్‌ చేశారు. ‘కుటుంబానికే నా మొదటి ప్రాధాన్యం’ అని పేర్కొన్నారు.