సాధారణగా దొంగతనం చేస్తే జైల్లో పెడతారు . అలాంటిది జైల్లోనే దొంతతనం జరిగింది . ఇక్కడ విచిత్త్రం ఏంటంటే నేరస్థుల సొమ్మే పోయింది . ఇక వివరాల్లోకి వెళ్తే అప్పట్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యలో నిందితులు అయిన మారుతీరావు మరియు అతని తమ్ముడు శ్రవణ్ ల ఉంగరాలు మాయం అయ్యాయి..

హత్యకేసులో భాగంగా నల్గొండ జిల్లాకి వచ్చిన సమయంలో వారి దగ్గరి నుండి ఆరు లక్షలు విలువ చేసే మూడు డిమాండ్ ఉంగరాలను స్వాదీనం చేసుకున్నారు .ఇక అక్కడినుండి వరంగల్ జైలుకి తరలించారు. ఇటివల విడుదల అయిన మారుతీరావు మరియు శ్రవణ్ ల యొక్క స్వాదీనం చేసుకున్న డిమాండ్ ఉంగరాలను తిరిగి ఇవ్వాలని జైలు అధికారాలను కోరారు . అయితే అ ఉంగరాలు లేవని జైలు అధికారులు బదులు ఇచ్చారు. అయితే దీనిపైన మారుతీరావు కుటుంబసభ్యులు జైలు అధికారి జైలేందర్ పై మరియు అజయ్ , అనిల్ కుమార్ లపై కేసు నమోదు చేసారు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . ఖచ్చితంగా తిరిగి ఇస్తామని అధికారులు చెబుతున్నారు ..