హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా మరోసారి బయటపడింది. ఓ ఆఫ్రికన్ మహిళ కాలేజీ విద్యార్థుల్ని టార్గెట్ చేసుకొని డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడింది. ఇంజినీరింగ్ కాలేజీలే అడ్డాగా సాగుతున్న దందాపై నాంపల్లి ఎక్సైజ్ పోలీసులకు సమాచారం రావడంతో పక్కాగా నిఘా పెట్టి ఆ మహిళను అరెస్టు చేశారు. ఆమె నుంచి 50 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకూ నైజీరియన్లు డ్రగ్స్ కేసుల్లో దొరికితే ఇప్పుడు ఘనా దేశానికి చెందిన మహిళ అరెస్టయ్యింది. ఈమెకు మాదకద్రవ్యాలు ఎవరు సరఫరా చేస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై పోలీసులు నిఘా పెట్టారు. ఆమె పాస్‌పోర్ట్‌, ఫోన్ అన్నీ సీజ్ చేశారు. కాల్‌డేటా ఆధారంగా ఆమె కస్టమర్లుగా ఎవరెవరు ఉన్నారో రాబట్టేందుకు రంగం సిద్ధం చేశారు.