గీతూ చాలా చలాకిగా, తన చిత్తూరు యాసతో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంది. మొదట్లో టిక్ టాక్, ఇంస్టాగ్రామ్ రీల్స్ తో ఫేమ్ అయిన గీతూ ఆ తరువాత జబర్దస్త్, శ్రీ దేవి డ్రామా కంపెనీ వంటి షోలలో అలరించింది. ఇక బిగ్ బాస్ అవకాశం రావడంతో ఒక్కసారిగా లైంలైట్ లోకి వచ్చేసింది. ఇక బిగ్ బాస్ లో టాప్ 5 లో ఉంటుంది అనుకున్న గలాటా గీతూ ఎలిమినేట్ అయిపోయింది. బిగ్ బాస్ మొదటి నాలుగు వారాలు బిగ్ బాస్ మొత్తం గీతూ చుట్టే తిరిగింది. ఓ వైపు గొడవలు మరో వైపు కామెడీ అంటూ చలాకిగా ఇంటి సభ్యులనే కాకుండా ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేసిన గీతూ ఎలిమినేషన్ అందరినీ షాక్ కి గురిచేసింది. ఇక బిగ్ బాస్ అయిపోయినా ఇంకా బిగ్ బాస్ ఇంటి ముచ్చట్లను మిగిలిన కంటెస్టెంట్స్ గురించి చెబుతూ ఇంటర్వ్యూ చేస్తోంది గీతూ .
కవిత నాతో గొడవపడింది:
బిగ్‌బాస్ లో అదిరెడ్డి, గీతూ మొదటి నుండి బాగా ఉండేవారు. ఆదిరెడ్డి గీతూ కోసం పనులు చేస్తున్నాడు అనేలా వారిద్దరూ ఉండేవారు. అయితే అంతవరకు అమ్మాయిలతోనే మాట్లాడని అది రెడ్డి గీతూతో మాత్రం త్వరగా కలిసిపోయాడు అందుకే గీతూ ఏదో మందు పెట్టింది మా ఆయనకి అంటూ ఆదిరెడ్డి భార్య కవిత గీతూ తో గడవ పడిందని ప్రచారం జరిగింది. ఇక ఇదే విషయం మీద గీతూకి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురుకాగా అలాంటిదేమీ లేదని నేను, ఆదిరెడ్డి మంచి స్నేహితులం అయ్యామని, అందులో ఆదిరెడ్డి భార్య కవితకి అభ్యంతరం లేదని చెప్పింది. పల్లెటూరు నుండి వచ్చిన అమ్మాయి కావడం వల్ల బిగ్ బాస్ మొదట్లో ఆదిరెడ్డి నాతో మాట్లాడటం చూసి అంత వరకు తన భర్త ఏ అమ్మాయితోనూ మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడుతున్నాడనే జలస్ ఫీల్ అయిందట ఆదిరెడ్డి భార్య కవిత,
ఈ విషయాన్ని గీతూ ఇంటర్వ్యూలో పంచుకుంది. అయితే గీతికా ఎలిమినేట్ అయ్యాక కవిత తో ఫోన్ లో మాట్లాడినపుడు కూడా చాలా బాగా మాట్లాడిందని మొదట్లో నీపై కోపం ఉండేది తరువాత అర్థమైందని కవిత చెప్పిందట. ప్రస్తుతం కవిత, ఆదిరెడ్డి తో కలిసి బయటకి కూడా వెళ్ళాం అలానే కొన్ని వీడియోస్ కూడా చేసాము అంటూ గీతూ క్లారిటీ ఇచ్చింది.