విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ మీడియా సమావేశంలో సంచలన విషయం చెప్పారు. పాక్ యుద్ధ విమానాన్ని భారత దళాలు కూల్చివేశాయి. మిగ్-21ను కోల్పోయామని తెలిపారు. మన పైలెట్ తమ అదుపులో ఉన్నట్టు పాకిస్తాన్ చెప్పింది. దీంతో ఆ పైలెట్ ఏమయ్యారా అన్న ఆందోళన నెలకొంది. భారత పైలెట్ ఆచూకీని కనిపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమ అదుపులో ఇద్దరు భారత పైలెట్లు ఉన్నట్టు ఇప్పటికే పాకిస్తాన్ చెబుతోంది. పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టడానికి భారత దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. మనదేశం జరిపిన దాడులకు ప్రతిగా పాకిస్తాన్ దాడులకు ప్రయత్నించినా మన దళాలు తిప్పికొట్టాయి.