‘మిర్చి’ భామకు పెళ్లి …

రానా హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లీడర్‌ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన భామ రిచా గంగోపాధ్యాయ. కెరీర్‌ మంచి ఫాంలో ఉండగానే భాయ్‌ సినిమా తరువాత నటనకు బ్రేక్‌ ఇచ్చి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిపోయారు. ఈ భామ తాజాగా ఓ శుభవార్త చెప్పారు.

తన క్లాస్ మేట్ జోయ్ తో నిశ్చితార్థం పూర్తయినట్లు రిచా గంగోపాధ్యాయ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంది. జోయ్ తో నాకు నిశ్చితార్థం అయింది. బిజినెస్ స్కూల్ లో జోయ్ ను కలిశాను. రెండు అద్బుతమైన సంవత్సరాలు బిజినెస్ స్కూల్ లో గడిసాయి. నా కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేసింది రిచా గంగోపాధ్యాయ్. అయితే జోయ్, రిచా పెళ్లి తేదీ ఎపుడు అనేది మాత్రం చెప్పలేదు.