మిస్టర్ వరల్డ్ బాడీబిల్డింగ్ పోటీల్లో వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన టి.రామకృష్ణ తృతీయ స్థానంలో నిలిచినట్లు వరంగల్ బాడీ బిల్డింగ్ సంఘం కార్యదర్శి సదానందం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 11 నుంచి థాయ్‌ల్యాండ్‌లో జరుగుతున్న మిస్టర్ వరల్డ్ బాడీ బిల్డింగ్ పోటీల్లో 70 కిలోల బరువు విభాగంలో కాంస్య పతకం సాధించారని వివరించారు.
గతంలో మిస్టర్ ఆసియా, మిస్టర్ ఇండియా, మిస్టర్ తెలంగాణ పతకాలు సాధించిన రామకృష్ణ తాజాగా ఈ ఘనత సాధించారని వెల్లడించారు. పతకం సాధించిన రామకృష్ణను సంఘం అధ్యక్షుడు విజయ్‌కుమార్, కార్యదర్శి సదానందం, తదితరులు అభినందించారు.