అభివృద్ధి పనులు జరగలేదని వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేష్ ను అడ్డుకున్న ప్రజలు గో బ్యాక్ అంటూ నినాదాలు

వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు సొంత నియోజకవర్గం లో చేదు అనుభవం ఎదురింది వరంగల్ అర్బన్ జిల్లా 12వ డివిజన్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన రమేష్ ను బాలాజీ నగర్ కాలనీ వాసులు అడ్డుకున్నారు మాజీ MLA రమేష్ కు ఓటు అడిగే అర్హత లేదంటూ యువకులు సభ సమీపంలో ధర్నాకు దిగారు ఒక్కసారిగా ఆందోళనకు దిగిన యువకులను పోలీసులు అడ్డుకున్నారు. వేదిక పై మాజీ ఎమ్మెల్యే ఆరోరి రమేష్ ను అడ్డుకునేందుకు యత్నించిన యువకులను గన్ మెన్లు అడ్డుకున్నారు, దీనితో సభ వేదిక పై ప్రసంగాన్ని అర్దాంతరంగా ముగిన్చుకొని రమేష్ వేదికపై నుంచి వెళ్ళిపోయారు.

అధికారంలో ఉన్నపుడు ఎలాంటి అభివృద్ధి చేయలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు