మీకు బుల్లెట్ బైక్ ఉందా ? అయితే జాగ్రత్త

ఆకలేస్తే పులి గడ్డి తినదు, ఈ నానుడి ఈ ఇద్దరు దొంగలకీ కరెక్ట్ గా సరిపోతుంది. వీళ్లుద్దరూ ఆషామాషీ బైక్ దొంగలు కాదు, బ్రాండ్ బాబులు. కేవలం బుల్లెట్ బైక్ ల్ని మాత్రమే దొంగతనం చేస్తారు. హీరోలు, హోండాలు, స్కూటీలు.. వీటిని వీళ్లు లెక్కే చేయరు. బుల్లెట్ కనపడిందా, అంతే క్షణంలో దాని సంగతి తేలుస్తారు. ఇప్పటి దాకా 50పైగానే బైకుల్ని మాయం చేశారు. తాజాగా వీరిని పోలీసులు అరెస్ట్ చేసి 10 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు.

ఇప్పటికే ఓసారి జైలుకెళ్లొచ్చినా బుల్లెట్ పై మమకారం చావక మళ్లీ దొంగతనాలు చేస్తూ పోలీసులకి చిక్కారు. హైదరాబాద్ లో పరిధిలో వీరు దొంగతనాలకు పాల్పడుతున్నారు.