మీటు ఉద్యమం ఇప్పుడు వరంగల్ లో కూడా

మీటూ ఉద్యమానికి అండగా నిలుస్తాం- విశ్రాంత ప్రొఫెసర్ గిరిజారాణి

హన్మకొండ హరిత హోటల్లో సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్, వైట్ రిబ్బన్ సివిల్ సొసైటీ ఫోరం సంయుక్తంగా ‘మీటూ.. వియ్ టూ’ పేరిట రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మీటూ ఉద్యమానికి అండగా తాము కూడా అండగా ఉన్నామని, ఈ మార్పు రాబోయే తరాల మహిళలకు మార్గదర్శకంగా మారుతుందని సమావేశంలో పాల్గొన్న రిటైర్డ్ ప్రొఫెసర్ గిరిజారాణిఅన్నారు. మహిళలు అన్నిచోట్ల లైంగిక వేధింపు లకు గురవుతున్నారని వారికి ఎవరి సహకారం లేని పరిస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.

సమావేశంలో వైట్ రిబ్బన్ సివిల్ సొసైటీ ఫోరం సభ్యులు ప్రొఫె సర్ కె.రామలక్ష్మి, తదితరులు మాట్లాడారు.