కేసీఆర్ గారి సంక్షేమ పథకాలే మళ్ళీ గెలిపిస్తాయి.

పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూర్ మండల కేంద్రంలో ఇంటి ఇంటి ప్రచారంలో భాగంగా మాట్లాడుతున్న పరకాల తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.

Advertisement

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పరకాల నియోజకవర్గానికి ఏమి చేయలేదని,కేసీఆర్ గారి ప్రభుత్వంలో పరకాల నియోజకవర్గంలో అభివృద్ధిలో మార్పు వచ్చిందని, గత ఎన్నికల్లో పరకాల నియోజకవర్గానికి అభివృద్ధి రుచి చూపిస్తాని చెప్పిన మాట వాస్తవం అని, పరకాల కు అభివృద్ధి రుచి చూపించమని, ఇప్పుడు మళ్ళీ గెలిపిస్తే ఫుల్ మిల్స్ పెట్టుతామని అన్నారు. గత ప్రభుత్వంలో సర్కారు దవాఖానకు పోలేని పరిస్థితని, ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినప్పుటి నుండి తెలంగాణ లో ఉన్న ప్రతి బిడ్డ సర్కారు దవాఖాన వైపు మొగ్గు చూపిస్తున్నారని, కేసీఆర్ గారు రైతుల సంక్షేమ కోసం రైతు బంధు పథకం ఏర్పాటు చేసిన ఘనత మన కేసీఆర్ గారిదని, గత ప్రభుత్వంలో దంపతుల పరిపాలన 15 సంవత్సరంలో వారు చేసిన అభివృద్ధి మార్క్ ఏంటో చెప్పాలని,నేను 4 సంవత్సరాల కాలంలో నా అభివృద్ధి మార్క్ ఏంటో చెప్పుతానని అన్నారు. మీ పరిపాలనలో పరకాల నియోజకవర్గం అభివృద్ధి తుంగలో తొక్కిన మీరు మళ్ళీ ఎం మొఖం పెట్టుకొని వస్తున్నారని ఆడిగినారు. ఢిల్లీ లో టిక్కెట్ ల కోసం కాళ్ళు పట్టుకుంటున్న మీరు అభివృద్ధి ఎలా చేస్తారని ఆడిగినారు.

కేసీఆర్ గారి పరిపాలనలో పరకాల నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు.