-మీ మద్య పెరిగిన బిడ్డని ఆశీర్వదించండి అభివృద్ది చేస్తా..

-దేశాయిపేటలో ప్రచారానికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు..

-గడప గడపనా నరేందర్ కు ఘనస్వాగతం..

-బతుకమ్మలు, బోనాలు,డప్పు చప్పుళ్ళు,కోలాటాలతో ఘన స్వాగతం పలికిన మహిళలు,కార్యకర్తలు..

-నీకే ఓటేస్తాం బిడ్డా అంటూ ముసలవ్వల దీవెనలు..

-నన్నపునేని నరేందర్ (వరంగల్ తూర్పు తెరాసా అభ్యర్ది)

మీ మద్య పెరిగిన వాన్ని నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి అభివృద్ది చేసి చూపిస్తా అని వరంగల్ తూర్పు టీఆర్ఎస్ అభ్యర్ది నన్నపునేని నరేందర్ అన్నారు.దేశాయిపేటలో ఇంటింటి ప్రచారం ప్రారంభించారు.స్థానిక బొడ్రాయి,రంగనాయక స్వామి దేవాయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మాజీమంత్రి బస్వరాజు సారయ్య గారు జెండా ఊపి ప్రచారాన్ని ప్రారంభించారు.గడప గడపుకు తిరుగుతూ కారుగుర్తుకు ఓటేయాల్సిందిగా అభ్యర్దించారు.గడప గడపన నరేందర్ గారికి ఘన స్వాగతం లబించింది.ఆడబిడ్డలు బొట్టు పెట్టి మీకే ఓటేస్తాం అంటూ ఆశీర్వదించారు.ముసలవ్వల వద్దకు వెల్లినప్పుడు వారి నుండి విశేష స్పందన లబించింది. ”పెద్ద కొడుకులా మమ్ముల సాదుతున్నరు మీకే ఓటేస్తాం బిడ్డా ” అంటూ నరేందర్ ను ఆశీర్వదించారు.ఈ ప్రచారానికి బారీ ఎత్తున మహిళలు ,తెరాసా శ్రేణులు హాజరయ్యారు..

ఈ సందర్బంగా నరేందర్ మాట్లాడుతూ నన్ను ఆశీర్వదించి అసెంబ్లికి పంపండి నియోజకవర్గ అభివృద్ది బాద్యత నేను తీసుకుంటానని,గత ఎమ్మెల్యే ఇక్కడ అభివృద్ది చేయకుండా అనేక ఇబ్బందులకు గురుచేసిందని అన్నారు.వారి ఇబ్బంది ఇక తొలగిందని,దేశాయిపేట లో లక్ష్మి మెగా టౌన్ షిప్ నుండి పోచమ్మమైదాన్ జంక్షన్ వరకు 8కోట్ల నిదులతో రోడ్లు,సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టామని పనులు వివిద దశల్లో ఉన్నాయని అన్నారు.

కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో సంక్షేమఫలాలు పేదలకు అందించారని,పించన్ ల ద్వారా వృద్దులకు పెద్దకొడుకుగా కేసీఆర్ గారు మారారని రానున్న ప్రభుత్వంలో 1000 రూ.ల నుండి 2016 రూలకు పించన్ పెంచనున్నారని అన్నారు.కళ్యాణ లక్ష్మి ద్వారా పేదింటి పెళ్ళికి పెద్దన్నగా కేసీఆర్ గారు నిలిచారని,డబుల్ బెడ్ రూం ఇళ్ళు సొంత ఇంటి స్థలం ఉంటే వాళ్ళ స్థలాల్లోనే నిర్మించి ఇచ్చేవిదంగా నిర్ణయం తీసుకున్నారని,తెలంగాణా రాష్ట్రం కోసం కొట్లాడిన కేసీఆర్ గారితోనే అభివృద్ది సాద్యమని అన్నారు.

ఇక్కడ పక్క ప్రాంతం వారు పోటీకి దిగుతున్నారని,ఒకరు ఖమ్మం,మరొకరు ఘన్ పూర్ నుండి వచ్చి బరిలో ఉంటున్నారని,నేను మీ మద్య పెరిగిన బిడ్డనని,పేద కుటుంబం నుంచి వచ్చిన నాకు కేసీఆర్ గారు గొప్ప అవకాశం కల్పించారని నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి అభివృద్ది చేసి చూపిస్తానని నరేందర్ అన్నారు.

ఈ ప్రచార కార్యక్రమంలో కార్పోరేటర్లు,తెరాసా నాయకులు,కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.