వాజేడు మండలం చీకుపల్లి గ్రామ సమీపంలో గల తెలంగాణా నయాగరా జలపాతం గా పేరుగాంచిన జలపాతానికి భారీగా వర్షపు వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది, బొగత జలపాతం వద్ద వరద ప్రవాహం స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో కొద్దిరోజుల వరకు బొగత జలపాత సందర్శనాన్ని మూసివేస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు. బొగత జలపాతాని చూడటానికి పర్యటకులు ఎవరు రావద్దని లోపలికి అనుమతులు పూర్తిగా నిలిపివేసినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.