ఈ రోజు తేది:03-08-2019 జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా యస్.పి. కుమారి చందన దీప్తి ఐ.పి.యస్ గారు ఆపరేషన్ ముస్కాన్ గురించి మాట్లాడుతూ…. ఇప్పటికీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బాల కార్మిక వ్యవస్థ ఒకటిని, కార్మికులుగా పనిచేసే 5 నుంచి 14 ఏళ్లలోపు పిల్లల్ని బాలకార్మికులుగా పరిగణిస్తారని, పిల్లలు ఎవరైనా బాలకార్మికులుగా ఉన్నారంటే వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లేనని, పరిశ్రమలు, వ్యవసాయం, తయారీ, మైనింగ్, నిర్మాణ రంగం, కర్మాగారాలలో, హోటల్స్‌లో, రైల్వే, బస్సు స్టేషన్‌లు, సేవలు సహా అనేక రంగాల్లో బాలలు కార్మికులుగా పనిచేస్తున్నారని, బాల కార్మికులుగా కొనసాగినవారు భవిష్యత్‌లో ఉన్నతమైన జీవితాన్ని గడిపేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయని, వీరికి సరైన విద్య లేకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని, పోటీతత్వంతో నిండిన సమాజంలో అన్నిరకాలుగా వెనుకబడిపోతున్నారని, పెద్దవారయ్యాక సరైన ఉపాధి దొరకని కారణంగా పలువురు నేరాలకు పాల్పడుతున్నారని, ఉపాధి మార్గాలు వెతుక్కునేందుకు సరైన మార్గదర్శనం, ఆర్థిక తోడ్పాటు లేకపోవడం, నైపుణ్యలేమి వంటి కారణాల వల్లే ఇలా మారుతున్నారని, నేటి బాలలే రేపటి పౌరులని..!

చిన్నారులే దేశ ప్రగతికి సోపానాలని..! కానీ అభివృద్ధిలో పరుగులు పెడుతున్న నేటి హైటెక్ యుగంలోనూ ఇంకా వెట్టిచాకిరి వ్యవస్థ చిన్నారుల బాల్యాన్ని చిదిమేస్తోందిని..! బాలకార్మిక వ్యవస్థ.. చిట్టి చేతులను చిత్ర హింసలు పెడుతోందిని..! బాల్యం ఎంతో అందమైనదని అలాంటి బాల్యం వారికి జీవితాంతం మానని గాయం చేస్తోందని, ఏ దేశంలో బాల కార్మికులు లేని, ఆరోగ్యవంతమైన బాలలుంటారో ఆ దేశం అభివృద్ధిలో ముందుంటుందని, బాల కార్మికులుగా మారడానికి ముక్యంగా పిల్లలు అనాధలు కావడం, కుటుంబ పేదరికం, నిరక్షరాస్యత తదితర కారణాలవల్ల బాలలు కార్మికులుగా మారుతున్నారని, కనీస అవసరాలకు సరిపడా ఆదాయం దొరకని అనేక కుటుంబాలు తమ పిల్లల్ని పనుల్లో చేర్పిస్తున్నాయని, చిట్టి,చిట్టి చేతులతో పనులు చేస్తూ బతుకు బండిని లాగుతున్నారని, వారు పనిచేసే చోట సరైన సమయానికి తిండి దొరకక పస్తులు ఉంటూ రోగాలపాలవుతున్నారని, బాలకార్మిక రక్కసి కబంధ హస్తాల నుంచి చిన్నారులకు విముక్తి కల్పించే లక్ష్యంతో ముస్కాన్ అనే బృహత్తర కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని, 2014 నుంచి ప్రతి ఏటా జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్‌ను నిర్వహించడంతో పాటు…

జులై నెలలో ముస్కాన్ కార్యక్రమాన్ని వివిధ శాఖల సమన్వయంతో తో పోలీస్ శాఖ అమలు చేస్తోందిని, బాల కార్మికులను పనిస్థలాల నుంచి తీసుకొచ్చి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నామని, మిస్సింగ్ కేసులను చేధించి బాలబాలికల్ని తమ తల్లిదండ్రుల చెంతకు చేరుస్తున్నామని, బాధిత చిన్నారులకు బాసటగా నిలుస్తున్నామని పలువిదాలుగా బాలలకు అండగా ఉంటూ మెదక్ జిల్లాలో జూలై 1 నుంచి జూలై 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్-5 వివరాలను జిల్లా యస్.పి. కుమారి చందన దీప్తి ఐ.పి.యస్ గారు వివరించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఏటా రెండు విడుతలుగా ఆపరేషన్‌ స్మైల్, ఆపరేషన్‌ ముస్కాన్‌ పేరుతో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోందని, అందులో భాగంగా మెదక్ జిల్లాలో జూలై 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్‌ ముస్కాన్‌ 5 పేరుతో అధికార యంత్రాంగం ప్రత్యేకంగా రెండు బృందాలను రంగంలోకి దించామని చిన్నారులతో పని చేయించడం చట్టరిత్యా నేరమని, ఆడుతూ, పాడుతూ, విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన బాలలు కార్మికులుగా మారిపోతున్నారని,

వీది బాలలను, బాలకార్మికులను రక్షించి వారికి విద్యను అందివ్వడం కోసం ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మయిల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, కొందరు వ్యాపారస్తులు పేదరికంలో ఉన్న వారిని గుర్తించి కార్మికులుగా చేర్చుకుని వారిచేత వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని, ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమాలు చేపట్టి బాల కార్మికులకు విముక్తి కల్పిస్తున్నామని ఆపరేషన్ ముస్కాన్-5లో భాగంగా మెదక్ జిల్లా మొత్తం 94 మంది బాల కార్మికులను కాపాడామని వీరిలో 83 మంది బాలురు ఉండగా, 11 మంది బాలికలు ఉన్నారని అట్టి వారిని గుర్తించి పునరావాస చర్యల్లో భాగంగా పోలీసులు వారిని తిరిగి వారి తల్లితండ్రులకు అప్పగించామని అలాగే బాల కార్మికులు ఎవరైనా మీ కంట పడినా, ఎక్కడైనా పని చేస్తున్నట్లు సమాచారం ఉన్నా నేరుగా 1098 చైల్డ్‌ లైన్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చుని అట్టి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి చిల్డ్రన్స్‌ హోమ్‌కు తరలిస్తారని, అలాగే వారిని బడికి పంపే చర్యలు తీసుకుంటారని అట్టి పిల్లలకు ఎవరు లేకపోతే ప్రభుత్వ హాస్టళ్లకు పంపించి విద్యను అందిస్తారని తెలిపినారు.