అతడికి ఆమె మేన మరదలు! ఆమెనే పెళ్లిచేసుకుంటానని పట్టుబట్టాడు. అంతకుముందు ఆమెకు ఖాయమైన మరో సంబందాన్ని రద్దు చేయించి మరీ నిశ్చితార్థం చేసుకున్నాడు. కొద్దిసేపట్లో పెళ్లి వివరాలు:

హుస్నాబాద్‌ మండలం పొట్లపల్లికి చెందిన కోల రాజలింగం కూతురు రజితకు ఆమె మేనబావ కరీంనగర్‌ జిల్లా చిన్నములుకనూర్‌కు చెందిన పందిపెల్లి శ్రీనివా్‌సతో వివాహం నిశ్చయమైంది. శనివారం ఉదయం 11 గంటలకు హుస్నాబాద్‌లోని ఫంక్షన్‌హాల్లో వధువు తరఫువారు పెళ్లి ఏర్పాట్లు చేశారు. శ్రీనివాస్‌ కల్యాణ మండపానికి రాకుండా నేరుగా చిగురుమామిడి పోలీస్టేషన్‌కు వెళ్ళాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న తాను ఇష్టపడిన మరో అమ్మాయిని తీసుకొని వెళ్లిపోయాడు. ఇక పెళ్లి ఆగిపోవడంతో రజిత కన్నీరుమున్నీరుగా విలపించింది. అయితే గతంలో తనతో వివాహ నిశ్చితార్థాన్ని రద్దుచేసుకున్నప్పటికీ చిన్నములుకనూర్‌కే చెందిన రమేశ్‌ అనే యువకుడు రజితను పెళ్లి చేసుకుంటానని ముందుకువచ్చాడు.

అటు వధువు కుటుంబీకులు అంగీకరించడంతో అదే రోజు రాత్రి 8:30 గంటలకు ఇరుకుటుంబీకులు, బందువుల సమక్షంలో రజిత, రమేశ్‌ల వివాహం వైభవంగా జరిగింది.