రేపు ఎనమాముల మార్కెట్ లో జరగబోయే వరంగల్ పార్లమెంట్ కు సంబంధించి ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు మూడంచల భద్రతతో పోలీస్ బందోబస్తు ఎర్పాటు చెస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం ప్రకటించారు.
ఓట్ల లేక్కింపు సంబందించి ఎర్పాటు చేసిన బందోబస్తు ఎర్పాట్లను పోలీస్ కమిషనర్ సెంటర్ , వెస్ట్ , ఈస్ట్ జోన్ల డి.సి.పిలు నరసింహ , శ్రీనివాసరెడ్డి , నాగరాజు మరియు ఎ.సి.పి , ఇన్స్‌పెక్టర్ల స్థాయి అధికారులతో కల్సి క్షేత్ర స్థాయి పర్యవేక్షణ చేసారు.
బందోబస్తులో భాగంగా ఎనమాముల మార్కెట్ ఒకటి మరియు రెండు ప్రధాన ద్వారాల్లో కట్టుదిట్టమైన భద్రత ఎర్పాటు చేయాల్సి వుంటుంది. ముఖ్యంగా ఓట్ల లెక్కింపు కేంద్రానికి తరలి వచ్చే లెక్కింపు అధికారులు, వివిధ పార్టీలకు చెందిన పొలింగ్ ఎజెంట్లకు జారీ గుర్తింపు కార్డులను పరిశీలించిన అనంతరం ప్రదాన ద్వారం కుండా అనుమతించాలని.

ఎట్టి పరిస్థితిలోను గుర్తింపు కార్డు లేనివారిని లోనికి అనుమతించ వద్దని, అధే విధంగా లెక్కింపు కేంద్రానికి వారిని అధికారులు సూచించిన విధంగా నియోజకవర్గాల వారిగా క్యూలైన్ లోని అనుమతించడంతో పాటు పోలీసులచే పూర్తి స్థాయి లో సదరు వ్యక్తులను సోదాలు నిర్వహించాలని. ముఖ్యంగా ఎట్టి పరిస్టితుల్లోను సెల్ ఫోన్లను లోనికి అనుమతించ వద్దని పోలీస్ కమిషనర్ అధికారులను సూచించడంతో పాటు ఎనమాములకు వచ్చే వాహనాలను నిర్ధేశించిన పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలను పార్కింగ్ చేసే విధంగా ట్రాఫిక్ అధికారులు తగుచర్యలు తీసుకోవాలని. సిబ్బంది మరియు అధికారులకు ఆప్పగించిన విధులపై సంబందిత అధికారులు స్పష్టత ఇవ్వాలని పోలీస్ కమిషనర్ అధికారులను అదేశించారు.