చట్టాలను కఠినతరం చేస్తున్నా రోజుకూ ఎక్కడో అక్కడ మహిళలపై వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. మహిళలతో పాటు చిన్నారులను వదలడం లేదు కొంతమంది దుర్మార్గులు. అత్యాచారాలకు పాల్పడుతూ వారిని అత్యంత దారుణంగా హతమార్చుతున్నారు. ఓ చిన్నారిని రేప్ చేయడంతో పాటు అతి దారుణంగా చంపేసిన ఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. జంషేడ్ పూర్ రైల్వే స్టేషన్ లో మంగళవారం రాత్రి తన తల్లితో నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారిని రింకూ అనే యువకుడు కిడ్నాప్ చేశాడు. తర్వాత చిన్నారిపై అత్యాచారం చేసి అత్యంత దారుణంగా చంపడమే కాకుండా దాతలను, మొండాన్ని వేరు చేసి పొదల్లో పడేశాడు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడు పాతనేరస్తుడు రింకూగా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే రింకుకు ఇలాంటి నేరాలు కొత్త కాదని.. గతంలో ఓ ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్‌ చేసి, హత్య చేశాడని.. ఆ కేసులో రెండేళ్లు జైలు శిక్ష అనుభవించి వారం రోజుల క్రితమే విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు. అంతేకాక రింకు తండ్రి పోలీస్‌ కానిస్టేబుల్‌.పాప కన్పించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది చిన్నారి తల్లి. దీని పై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అయితే (బుధవారం) ఉదయం చిన్నారి మృతదేహం కన్పించడంతో రైల్వే స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజ్‌ ను పరిశీలించారు. నిందితుడిని పాత నేరస్తుడు రింకూగా గుర్తించారు పోలీసులు.