మృత్యుదేవతకు ఆమె అంటే భయం

ఆమెను అంద‌రూ మ‌రిచిపోయారు, చివ‌ర‌కు మృత్యువు కూడా ఆమెను మ‌రిచిపోయింది. ఆమె వ‌య‌స్సు 129 ఏళ్ళు, 40 ఏళ్ళ నుంచి చావుకోసం ఎదురు చూస్తోంది. అయినా… అది ద‌గ్గ‌ర కు రావ‌డంలేదు. 3 త‌రాల సంతానం ఆమె క‌ళ్ళ‌ముందే గ‌తించిపోయింది. ఇప్పుడు ఆమె ఒక్క‌టే 4వ త‌రం మ‌న‌వ‌రాలితో చావుకోసం ఎదురుచూస్తోంది. రెండు ప్ర‌పంచ యుధ్ధాలు చూసింది. రష్యాలో జార్ఝ్‌ చ‌క్ర‌వ‌ర్తుల ప‌త‌నం నుంచి లెనిన్ విగ్ర‌హాల కూల్చివేత‌వ‌ర‌కు , ర‌ష్యా విచ్చిన్నం వ‌ర‌కు ఇలా ఎన్నో ప్ర‌పంచ వింత‌లకు ఆమె సాక్షి. ఇప్ప‌టికీ త‌న ప‌ని తాను చేసుకుంటుంది. త‌న‌కు బ్ర‌త‌కాల‌ని 40 ఏళ్ళుగా ఆశ‌లేద‌ని, దేవుడు తీసుకుపోతాడ‌ని ఎదురుచూస్తోన్నారు. అయితే ఆమెను అంద‌రూ వ‌దిలేసిపోయిన దేవుడు కూడా మ‌రిచి పోయాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

మృత్యువుకు ఆమె అంటే కోపం అని బావిస్తున్నాని అందుకే త‌న‌ను తీసుకుపోవ‌టం లేద‌ని ఈ మ‌హిళ బాధ‌ప‌డుతుంది.