పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్‌ మెరుపుదాడులు చేపట్టింది. నియంత్రణ రేఖను దాటి పాక్‌ ఉగ్రశిబిరాలను భారత వైమానిక దళం ధ్వంసం చేసి ప్రతీకారం తీర్చుకుంది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ నేపథ్యంలో భారత సైన్యం సర్వసన్నద్ధమైంది. పాక్‌ నుంచి ఎదురయ్యే ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఐఏఎఫ్‌ ప్రకటించింది. అంతర్జాతీయ సరిహద్దు, సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి హై అలర్ట్‌ ప్రకటించింది. పంజాబ్‌ సరిహద్దులో కూడా అప్రమత్తమైంది. పాకిస్థాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ దాడులకు దిగితే వాటిని ఎదుర్కొనేందుకు మన వాయుసేన భారీ రక్షణ వ్యవస్థతో సిద్ధమైంది.