{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1580448983467","total_editor_time":6,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1580448929615","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

జన సముదాయం ఎక్కువుగా ఉన్న చోట వైరస్ లు బాగా వ్యాప్తి చెందుతాయని, అందువల్ల ప్రజలు మేడారం జాతరలో ప్రజలు కరోనా వైరస్, ఇతర వైరస్ ల గూర్చి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తుల కలుషితమైన దుస్తులు, ఇతర వస్తువులు, కరచాలనం, తాకడం వల్ల వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి ప్రవేశిస్తుంది. అరుదుగా మలమూత్రాల ద్వారా కూడా వైరస్‌ వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తుంది. బస్టాండ్ లు, రైల్వే స్టేషన్ లు, విమానాశ్రయాలలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

వైరస్‌ సోకిన వ్యక్తులు తుమ్మడం, దగ్గడం వల్ల వెలువడే లాలాజల తుంపర్ల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. లక్షణాల్లో ముక్కుల నుంచి స్రావాలు కారడం, దగ్గు, తలనొప్పి, గొంతు నొప్పి, జ్వరం, నీరసం, నిస్సత్తువ, ఫ్లూ జ్వరం, వైరస్‌లు శ్వాస నాళాలు, శ్వాస కోశాలకు వ్యాపించినప్పుడు బ్రాంకైటీస్, న్యూమోనియా లక్షణాలు బయటపడతాయి. వృద్దులు, దీర్గ కాలిక రోగులకు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళకు తొందరగా సోకే ప్రమాదముంది. కాచి చల్లార్చిన మంచినీరు, పండ్ల రసాలు తీసుకోవాలి.

ఈ కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించి తగు సూచనలు పాటించాలి. వైద్య నిపుణులు ఈ వైరస్ కు తగిన శాశ్వత మందులు కనిపెట్టే వరకు వ్యాధిపై అప్రమత్తతో ఉండి బయటకు వెళ్ళాల్సి వస్తే ముఖానికి మాస్క్‌ ధరించాలి. వైరస్‌ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలకు, కోళ్ల ఫారాలు, జంతు సంరక్షణ శాలలు, కబేళాలలు, డంపింగ్ యార్డ్స్ లాంటి వాటి దగ్గరకు వెళ్లకుండా ఉండడం మంచిది. అనుమానితులకు, ఇతురులకు దూరంగా ఉండాలి. దగ్గినా, తుమ్మినా, కర్చీప్‌ అడ్డుపెట్టుకోవాలి. తరుచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.