తెలంగాణ కుంభమేళ శ్రీ సమ్మక్క – సారలమ్మల మహాజాతర సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ అద్వర్యంలో పర్యాటకుల, భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి మేడారం కు హెలికాప్టర్ సేవలను రాష్ట్ర పర్యాటక మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ బేగంపేట్ లోని పాత ఎయిర్ పోర్ట్ లో ప్రారంబించారు.

Advertisement

ఈ టూరిజం ప్యాకేజీ లో బాగంగా బేగంపేట ఎయిర్ పోర్టు నుండి మేడారం, మేడారం నుండి హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టు వరకు నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్ నుండి 6 గురు ప్రయాణికులకు 1లక్ష 80 వేలు తో పాటు GST (1.80.000 + జి యస్ టి) ఉంటుందన్నారు. వీటితో పాటు మేడారం జాతర వ్యూ హెలిక్యాప్టర్ నుండి చూసేందుకు ప్రతి ప్రయాణికుడికి 2999.00 నామ మాత్రపు చార్జీ తో మేడారం శ్రీ సమ్మక్క – సారలమ్మ ల మహా జాతర కు వచ్చిన భక్తులకు మరియు పర్యాటకులకు హెలిక్యాప్టర్ లో విహరించే అద్బుత అవకాశంను తెలంగాణ పర్యాటక శాఖ కల్పించిందన్నారు.

హైదరాబాద్ నుండి ఆరుగురు ప్రయాణికులకు 1లక్ష 80 వేలుతో పాటు జీఎస్టీ ఉంటుందన్నారు.విమాన సర్వీసులతో పాటు సమ్మక్క, సారలమ్మ దర్శనం కల్పిస్తామని, అదేవిధంగా రూ.2999 అదనంగా చెల్లిస్తే మేడారం జాతర ను హెలికాప్టర్‌ ద్వారా తిలకించేందుకు తెలంగాణ పర్యాటక శాఖఅద్బుత అవకాశం కల్పించిందన్నారు. పర్యాటకులు ఈ సదుపాయన్ని ఉపయోగించుకునేందు 9400399999 నంబర్‌ను సంప్రదించాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, టూరిజం చైర్మన్‌ భూపతి రెడ్డి, రాష్ట్ర పౌర విమానయాన శాఖ డైరెక్టర్ భరత్ రెడ్డి, టూరిజం ఎండీ మనోహర్‌తో పాటు పర్యాటక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.