{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":["add_sticker","add_photo_directory"],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1581516658134","total_editor_time":393,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1581516560710","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

మేడారం జాతరలో దొరికిన సెల్ ఫోన్లను భద్రపరచి సమాచారం సేకరించి వారికి అందజేసి నిజాయితీ చాటిన కానిస్టేబుల్ లక్ష్మణ్

Advertisement

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కోహెడ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎల్. లక్ష్మణ్, మేడారం జాతర బందోబస్తుకు వెళ్లగా అక్కడ విధి నిర్వహణలో ఉండగా రోడ్డుపై రెండు స్మార్ట్ సెల్ ఫోన్లు దొరికినాయి, వాటి గురించి అక్కడ తెలుసుకొనగా ఎవ్వరూ రానందున, ఈరోజు ఉదయం ఫోన్లకు చార్జింగ్ పెట్టి ఫోన్లు ఆన్ చేయగా మెదక్ జిల్లా నర్సాపూర్ గ్రామానికి చెందిన విజయ్ కుమార్, శ్యామల, ఫోన్ చేసి ఈ ఫోన్లు మావి అని తెలపగా కోహెడ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి వచ్చి తీసుకుని వెళ్ళమని సమాచారం ఇవ్వగా, ఇరువురు రాగా విచారణ చేసి వారు పోగొట్టుకున్న రెండు స్మార్ట్ సెల్ ఫోన్లను వారికి అందజేశారు, ఇరువురు ఆనందం వ్యక్తం చేసి నిజాయితీ చాటుకున్న కానిస్టేబుల్ లక్ష్మణ్ అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మణ్ నిజాయితీ మెచ్చి పోలీస్ అధికారులు సైతం అభినందించారు.

మేడారం సమ్మక్క , సారలమ్మ జాతరలో పోగొట్టుకున్న డబ్బును, పర్సును వరంగల్ ఏఆర్ ACP బి. సదానందం మంగళవారం బాధితుడికి అందించారు.

వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం రాజీపేట గ్రా మానికి చెందిన చంద్రశేఖర్ కుటంబ సభ్యు లతో కలిసి గత శనివారం మేడారం జాతర కు వెళ్లాడు. సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద తల్లులను దర్శించుకునే క్రమంలో అతని జేబులో ఉన్న పర్సు జారి కిందపడి పోయింది. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న వరంగల్ ఏఆర్ ఏసీపీ బొంగోని సదానందంకు ఆ పర్సు దొరికింది. మైక్ లో పిలిచినా ఎవరు స్పందించకపోవడంతో పర్సును తనవద్దనే ఉంచుకున్నారు. బాధితుని పర్సులో ఉన్న ఆధార్, ఏటీఎం కార్డులు, అడ్రస్ ఆధారంగా బాధితుడికి సమాచారం అందించి మంగళ వారం సీపీ కార్యాలయానికి పిలిపించి పర్సు తో పాటు అందులో ఉన్న రూ. 10వేల నగదును అందించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ ఏసీపీ సదానందంకు కృతజ్ఞత లు తెలిపాడు .