{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1580524866150","total_editor_time":1,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1580524790417","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

మండలంలోని మేడారం జాతరలో13 కోట్లతో విద్యుత్ పనులు చేపట్టినట్లు ట్రాన్స్కో ఎస్.ఈ నరేష్ తెలిపారు. సమ్మక్క-సారలమ్మ జాతరకు అంతరాయంలేని నిరంతర విద్యుత్ అందించేందుకు జాతర పరిధిని 102 కోర్ ఏరియాగా ప్రధానమైన 80 ప్రదేశాలలో మోడెమ్ లు ఏర్పాటు చేసి ఆన్లైన్ ద్వారా 2 కంట్రోల్ రూమ్ లను వరంగల్ లోని తమ శాఖ చీఫ్ జనరల్ మేనేజర్ మోహన్ రావు, కిషన్ లు, చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏ.గోపాల్ రావు పర్యవేక్షిస్తున్నట్లు ఎస్.ఈ తెలిపారు.

Advertisement

యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన ఈ పనులలో 450 సిబ్బంది పాల్గొనగా అందులో 125మంది ఇంజనీర్లు ఉన్నారన్నారు. వీరి సహకారంతో 1200 కొత్తవి వేయగా, 400 అదనంగా వేయవలసి ఉందన్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో టవర్స్ కొరకు 200 పోల్స్ వేయవలసి ఉండగా 125 వేశామని, మరో 75 వేయవలసి ఉన్నదన్నారు. 216 ట్రాన్ఫార్మర్స్ బిగించామన్నారు. 11కెవి సామర్థ్యంతో 150 కిలోమీటర్ల విద్యుత్ లైన్ వేశామన్నారు. ఒక లైన్ మరో లైన్ కు తాకకుండా 11వేల ఫెసర్స్ ఏర్పాటు చేశామన్నారు.

అవసరమైన 74 ట్రాన్స్ఫార్మర్స్ కు కొన్నింటికి ఐరన్ తోను, మరి కొన్నింటికి వెదురుతోను ఫెన్సింగ్ చేయించామన్నారు. 5 ఎం.వి.ఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ లను 8 ఎం.వి.ఏ లుగా సామర్ధ్యం పెంచామన్నారు. కేవలం జాతర కొరకు 5 ఎంవిఏ సామర్ధ్యం గల ట్రాన్స్ ఫార్మర్లు ప్రత్యేకంగా బిగించడం జరిగిందన్నారు. ములుగు, కమలపూర్ నుండి విద్యుత్ సరఫరా కాగా మొత్తం 3 వేల పోల్స్ తో 26 ఎం.వి.ఏ ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ ను అందిస్తున్నాయన్నారు. తాడ్వాయి నుండి చిన బోయినపల్లి, తాడ్వాయి నుండి పస్రా రూట్లలో వేటగాళ్ళు ఉచ్చులు వేయకుండా పోలీస్ శాఖ సహకారంతో నిరంతర పర్యవేక్షణ చేస్తునట్లు వెల్లడించారు.