{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1581492322710","total_editor_time":1,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1581492300252","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

మేడారం మహా జాతర హుండీల లెక్కింపు బుధవారం ప్రారంభమైంది. హన్మకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో హుండీల లెక్కింపు కొనసాగుతోంది. 200 మంది సిబ్బందితో 494 హుండీలను లెక్కించనున్నారు. హుండీల లెక్కింపు ప్రదేశంలో సీసీ కెమెరాలు, పోలీస్‌ భద్రత ఏర్పాటు చేశామని దేవాదాయశాఖ అధికారులు వెల్లడించారు. జాతరలో సమ్మక్క గద్దె వద్ద 202, సారలమ్మ గద్దె వద్ద 202, గోవింద రాజు గద్దె వద్ద 25 హుండీలు, పగిడిగిద్దరాజు గద్దె వద్ద 28, 38 బట్ట హుండీలను అధికారులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

మేడారంలో ఆగని భక్త ప్రవాహం:

Advertisement

మేడారం మహాజాతర అనంతరం వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. మహా జాతర ముగిసినా తిరుగువారానికి ముందు ఆదివాసీ ఆరాధ్య దైవాలు సమ్మక్క సారలమ్మను దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లిస్తున్నారు. భక్తుల రద్దీ తగ్గినప్పటికీ గద్దెలను శుభ్రపరచకపోవడంతో సోమవారం గద్దెల తలుపులను తెరవలేదు, భక్తులు బయటి నుంచే మొక్కులు చెల్లిస్తున్నారు. కాగా, యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టి జాతర పరిసరాలను పూర్వ స్థితికి తీసుకురావాలని ములుగు జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. మేడారంలో జిల్లా అధికారులతో మాట్లాడుతూ భక్తులు వదిలిన వ్యర్థాల తొలగింపు చేపట్టాలన్నారు.

అధికారులందరూ సమన్వయ కృషి చేసి మేడారం ప్రాంతాన్ని పూర్వ స్థితికి తేవాలని కోరారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర హుండీలు నగరానికి చేరుకున్నాయి. జాతర ముగియడంతో వీటిని లెక్కింపు కోసం భారీ పోలీసు బందోబస్తు మధ్య మొత్తం 494 హుండీలను టీటీడీ కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. 12 నుంచి హుండీల లెక్కింపు ప్రారంభమవుతుందని జాతర కార్యనిర్వహణాధికారి రాజేంద్రం తెలిపారు.