మేనల్లుడి మోజులో పడి భర్తనే కడతేర్చింది ఓ ఇల్లాలు. ఇప్పటికే ఎస్ఐ పరీక్షలో అర్హత కూడా సాధించిన ఆమె త్వరలోనే ఎస్ఐ కూడా అయ్యేది. బీఈడీ చదివిన సంగీత మేనల్లుడి విజయ్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. దీనికి తన భర్త అడ్డుగా భావించి హత్యకు ప్లాన్ చేసింది. భర్త రైల్వే ఉద్యోగి కూడా కావడంతో ఉద్యోగంతో పాటు మేనల్లుడితో సంబంధం కొనసాగుతుందని భర్తను చంపేసింది.
మొదట కరెంట్ షాక్‌తో భర్తను చంపాలని సంగీత నిర్ణయించుకుంది. విజయ్ సలహాతో సంగీత ప్లాన్ మార్చింది. నిద్రమత్తులో ఉన్న భర్తను హత్య చేయాలని ప్లాన్ వేసింది. మద్యం మత్తులో ఇంటికొచ్చిన శ్రీనివాస్‌ను ప్రియుడితో కలిసి చంపేసింది. మేనల్లుడు భర్తతలపై బండరాయితో మోదుతుంటే కదలకుండా సంగీత గట్టిగా పట్టుకుంది. అరుపులు వినపడకుండా రైలు వచ్చేటప్పుడు భర్తను సంగీత చంపింది.ఇద్దరు కలిసి శవాన్ని చాపలో చుట్టి బోరబండ రైల్వే ట్రాక్ పక్కన పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. నిందితురాలు సంగీత బీఈడీ చదివింది.