పాతబస్తీలో మిస్సింగ్ అయిన ఒమన్ దేశానికి చెందిన యువతిని ఆమెను తీసుకెళ్లిన యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 12న ఫలక్ నూమా పోలీస్ స్టేషన్ పరిధిలో జహానుమా ప్రాంతంలో ఓ యువతి అదృశ్యం అయినట్టు కేసు నమోదు అయింది. అతీఖ్ అనే యువకుడిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో వీరి కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు. చివరకు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పటాన్ చెరులో యువకుడి మేనమామ ఇంట్లో వీరిద్దరూ ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను ఎవరూ కిడ్పాప్ చేయలేదని.. గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నామని యువతి పోలీసులకు తెలిపింది. తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లనని.. అతీఖ్ నే వివాహం చేసుకుంటానంటోంది. దీంతో ఆమె మైనర్ కావడంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు హోమ్ కు తరలిస్తున్నారు. యువకుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.