వయసు 43 ఏళ్లు. 23 ఏళ్ల కిందట ఆనంద్‌తో పెళ్లైంది. సంతాన భాగ్యం కలగ లేదు. చాలా కాపురాల్లో లాగే, వాళ్ల సంసారమూ మొదట్లో బాగానే సాగింది. ఐతే… ఆఫీస్‌కి ఉద్యోగానికి వెళ్తూ, సాయంత్రం వేళ వచ్చేటప్పుడు తనతో ఓ కుర్రాణ్ని బైక్‌పై వెంట తెచ్చేవాడు ఆనంద్. ఆ కుర్రాడు ఉండేది అక్కడకు దగ్గర్లోనే. ఆనంద్ బైక్ దిగి తన దారిన తాను ఇంటికి పోయేవాడు. చనువు కొద్దీ ఆనంద్ అప్పుడప్పుడూ ఆ కుర్రాణ్ని తన ఇంట్లో టీ, కాఫీలకు పిలవడం మొదలుపెట్టాడు. అలా వచ్చిన అతడికి.।
ఆనంద్ భార్య పరిణీతితో పరిచయం ఏర్పడింది. అదికాస్తా హద్దులు దాటింది. వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆనంద్ లేనప్పుడు అప్పుడప్పుడూ అతని ఇంటికి వచ్చి పరిణీతిని కలిసేవాడు. ఇలా వీళ్ల బంధం బలపడగా ఆనంద్, పరిణీతి మధ్య గొడవలు మొదలై, రాన్రానూ అవి ఎక్కువయ్యాయి. పరిస్థితి ఎంతదాకా వెళ్లిందంటే… ఆమె ఆనంద్‌కి విడాకులు ఇచ్చి, ఆ కుర్రాణ్ని పెళ్లి చేసుకోవాలని డిసైడైంది. అందుకు అతను కూడా సరే అన్నాడు. పెళ్లైన తొమ్మిది ఏళ్ల తర్వాత ఆనంద్‌కి విడాకులు ఇచ్చేసింది పరిణీతి. తనంటే ఇష్టం లేని భార్యతో కొనసాగడం కంటే విడిపోవడమే బెటరనుకున్నాడు ఆనంద్ కూడా. అక్కడితే వాళ్ల సంసార కథ ముగిసింది. అనుకున్నట్లుగానే పరిణీతి, ఆ కుర్రాణ్ని ఓ గుళ్లో సాదాసీదాగా పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి పెద్దవాళ్లెవరూ రాలేదు. ఆమె ఆ కుర్రాడితో కలిసి అతని రూంకి వెళ్లింది. ఇలా రెండు వారాలు గడిచాయి. ఓ రోజు ఆమె సూపర్ మార్కెట్‌కి వెళ్లి తిరిగొచ్చేసరికి , తన ముఖ్యమైన సామాన్లు, బట్టలతో సహా పారిపోయాడు ఆ కుర్రాడు. అతని రూంకి వచ్చి చూసిన పరిణీతికి మతిపోయింది.
ఆ కుర్రాడికి కాల్ చేస్తే, స్విచ్ఛాఫ్ అని వస్తోంది. ఇటు మాజీ భర్త దగ్గరకు వెళ్లే ఛాన్స్ లేక, అటు ఆ కుర్రాడు పారిపోవడంతో దిక్కులేనిదైంది పరిణీతి. మెహసానా పోలీస్ స్టేషన్‌లో ఆ కుర్రాడిపై కంప్లైంట్ ఇచ్చింది. ఐదేళ్లుగా తమ మధ్య వివాహేతర సంబంధం కొనసాగిందని తెలిపింది. ఆ కుర్రాణ్ని పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. ఈ కేసుపై ఎలా స్పందించాలో తెలియక… అతన్ని త్వరలోనే పట్టుకుంటామని సమాధానం ఇచ్చారు పోలీసులు.