మొబైల్ చేతిలో వుంటే చాలు పెద్దవాళ్లే పరిసరాలను మరిచిపోతారు. మరి అదే మొబైల్ ఓ బుజ్జిగాడి చేతికి చిక్కేసరి తను చేస్తున్న పని కూడా మర్చి పోయి గేమ్‌లో మునిగిపోయాడు. అర్జంట్ పనిమీద బాత్‌రూంలో దూరాడు చైనాకు చెందిన ఓ పిల్లాడు. వెళ్తూ వెళ్తూ మొబైల్‌ని తీసుకుని వెళ్లాడు. నాన్న తీసుకెళ్తుంటే చూసి ఉంటాడు.. వాడు కూడా తీస్కెళ్లాడు.

గంట అయిపోయింది లోపలికి వెళ్లిన వాడు ఇంకా బైటకు రావట్లేదేంటి అని తల్లి ఓసారి లోపలికి తొంగి చూసింది. వాడు అలానే గేమ్ ఆడుతూ టాయ్‌లెట్‌లో కూర్చుని ఉన్నాడు. అమ్మకి అర్థమైంది. వీడు గేమ్‌లో మునిగిపోయాడు అని. లోపలికి వచ్చి అరిచింది. అమ్మ అరుపుతో ఉలిక్కి పడ్డ పిల్లాడు లేవడానికి ప్రయత్నించాడు. కానీ లేవలేకపోతున్నాడు. అమ్మా! లేవడానికి రావట్లేదు, అనేసరికి ఆమె కూడా పిల్లాడిని లేపడానికి ట్రై చేసింది.

కానీ ఎంతకీ రావట్లేదు. కమోడ్‌లో ఇరుక్కుపోయాడు. ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసింది. అయిదుగురు అగ్నిమాపక సిబ్బంది వచ్చి టాయిలెట్‌పై సీటు కట్ చేసి పిల్లవాడిని బయటకు తీశారు.