వరంగల్ నగరంలోని కాకతీయ మ్యూజికల్ గార్డెన్ పేరులోనే మ్యూజిక్ . లోపల అంతా నిశ్శబ్దమే . ముందు చూస్తే ఆకట్టుకునేలా సొబగులు ఉన్నాయి . లోపలికి వెళ్తే పచ్చని గడ్డి తప్ప ఇతర వస్తువులేవీ లేవు . పనిచేయని మ్యూజిక్ వాటర్ ఫౌంటేన్ , నీరు లేని బోటింగ్ కొలను , పిల్లల ఆటవస్తువులు విరిగిపోయి కనిపిస్తుంటాయి .

ఒకప్పుడు కుటుంబ సమేతంగా ఆహ్లాదం కోసం ఈ పార్క్ కు వెళ్లేవారు . కానీ ఇప్పుడు కనీస ఏర్పాట్లు లేక అధ్వానంగా తయారైంది . ఇక పచ్చని పార్క్ ప్రేమజంటలకు అడ్డాగా మారింది . కుడా ( కాకతీయ అర్బన్ డెవల్ మెంట్ అథారిటీ అధికారులు స్పందించి పూర్వవైభవాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది .