యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్ గా అమ్రపాలి కాట

కలెక్టర్ అమ్రపాలి కాట. జిల్లా పాలనాధికారిగా ఆమెకు సాటిలేరెవరు అన్న రీతిలో దూసుకుపోతున్నారు. యంగ్ కలెక్టర్‌గా అమ్రాపాలి, పాలనలో ప్రత్యేకత చాటుతున్నారు.

తెలంగాణాకి రెండో రాజధానిగా చెప్పుకొనే వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌గా అమ్రపాలి పాలనా రీతులపై హెచ్‌ఎమ్‌టీవీ స్పెషల్‌ రిపోర్ట్‌. పాలనలో ఒక్కో అధికారిది ఒక్కో స్టైల్. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అమ్రాపాలి కాట ప్రత్యేక చాటుకుంటున్నారు. యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్ గా తనదైన శైలిలో విధులు నిర్వహిస్తున్నారామె. ఎంతో చలాకీగా ఈ యంగ్ కలెక్టర్ పనులు చక్కబెడతారనే పేరుంది. వర్క్ స్టైల్ ఓ విధమైతే ఆమె వార్తల్లోనూ ఎక్కువగానే ఉంటారు. అయితే అమ్రపాలి కాట పాలనలో తనదైన శైలిలో ప్రత్యేకత చాటుతున్నారు.

చిన్నారి డాక్టర్, సెల్పీ హాస్టల్, ఫండ్ యువర్ సిటీ

వరంగల్ అర్బన్ జిల్లాలో రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రయోగాత్మకంగా చిన్నారి డాక్టర్, సెల్పీ హాస్టల్, ఫండ్ యువర్ సిటీ పేరుతో ఆకర్షణీయమైన కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కలెక్టర్‌ అమ్రపాలి చొరవతో విద్యా, ఆరోగ్యశాఖ సంయుక్తంగా చిన్నారి డాక్టర్‌ ప్రారంభించారు. పిల్లల కోసం హెల్త్‌ క్లబ్‌ కూడా నిర్వహిస్తున్నారు. మొదట రాష్ట్రంలో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా హన్మకొండ ప్రభుత్వ బాలికల పాఠశాలలో చిన్నారి డాక్టర్‌ ప్రారంభించారు. వరంగల్‌ అర్బన్‌లో 586 స్కూల్స్‌లో హెల్త్‌క్లబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వేల్పేర్ హాస్టల్స్ పేరుతో ఓ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశారు కలెక్టర్‌ అమ్రపాలి. ఈ గ్రూప్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ల జిల్లా స్ధాయి అధికారులతో పాటు వార్డెన్లను గ్రూప్ లో చేర్చారు. వార్డెన్లు ప్రతీరోజు సంబంధిత హాస్టళ్లకు వెళ్లి విద్యార్ధులను వరుసలో కూర్చోబెట్టి అల్పహారం వడ్డించే సమయంలో వడ్డించిన తరవాత సెల్పీలు దిగి ఫోటోలను అప్ లోడ్ చేయాలని సూచించారు.

సెల్పీ కొట్టు హాజరు పట్టు

కలెక్టర్ చేపట్టిన సెల్పీ కొట్టు హాజరు పట్టు కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. కలెక్టర్‌గా రూల్‌ బుక్‌ ప్రకారం రోటిన్‌గా విధులు నిర్వర్తించడం అమ్రపాలి స్టైల్‌ కాదు. యంగ్‌గా, ఎనర్జిటిక్‌, డైనమిక్‌గా ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కలెక్టరంటే ఇలానే ఉండాలనే మొనాటనికీ బ్రేక్‌ చెప్పే అమ్రపాలి ట్రెక్కింగ్‌ వంటి అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌లో కూడా పార్టిసిపేట్‌ చేస్తూ యుత్‌ ఐకాన్‌గా నిలుస్తుంటారు.

ఫండ్ యువర్ సిటీ

మరోవైపు ఫండ్ యువర్ సిటీ పేరుతో మరో కార్యక్రమాన్ని చేపట్టారు. ధనవంతులు సిటి డెవలప్ మెంట్ కోసం ముందుకు వచ్చి ఫండ్ ఇచ్చేలా కార్యక్రమాన్ని రూపొందించారు. కలెక్టర్ అమ్రాపాలి. సామాజిక కార్యక్రమాల్లోనూ ఆమె ప్రత్యేక ముద్రను చాటుకుంటున్నారు అమ్రపాలి.