సిద్దిపేట జిల్లా చేర్యాల సీఐ శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు పడింది. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాడని ఆయన్ను సిద్దిపేట సీపీ శ్వేత సస్పెండ్ చేశారు. గత నెల 24న యాక్సిడెంట్‌కు గురైన సిద్దిపేట జిల్లా చేర్యాల సీఐ శ్రీనివాస్ సస్పె్షన్షన్‌కు గురయ్యాడు. ఈ మేరకు సిద్దిపేట సీపీ శ్వేతా ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ యాక్సిడెంట్‌కు గురైతే సస్పెండ్ చేయటమేంటని ఆలోచిస్తున్నారా ? పూర్తి వివరాలు: గతేడాది సిద్దిపేట జిల్లా చేర్యాలలో అధికార బీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ సభ్యుడు మల్లేశం హత్యకు గురైన విషయం తెలిసిందే. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఆయన్ను ప్రత్యర్థులు కిరాతకంగా హతమార్చారు. ఈ హత్యోదంతం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

అయితే, హత్య జరిగన రోజు స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కేసు వివరాలు తెలుసుకునేందుకు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అయితే అక్కడ సీఐగా ఉన్న శ్రీనివాస్ అందుబాటులో లేడు. సీఐ రాక కోసం ఎమ్మెల్యే గంటకు పైగా వెయిట్ చేశాడు. డిపార్ట్‌మెంట్ పని విషయమై ఆయన బయటకు వెళ్లాడని భావించిన ఎమ్మెల్యే ఉన్నతాధికారులకు ఫోన్ చేశాడు. అయితే సీఐ తన వ్యక్తిగత అవసరాల కోసం ఉన్నతాధికారుల అనుమతి లేకుండా స్టేషన్ వదిలి వెళ్లినట్లు తెలిసింది. దీంతో సీఐపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్కక్తం చేశాడు. డ్యూటీ చేయకుండా వ్యక్తిగత పనులు చూసుకోవటమేంటని మండిపడ్డారు.