పుల్వామా ఉగ్రదాడికి గట్టి ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ చేస్తున్న హెచ్చరికలకు పాకిస్తాన్ హడలిపోతుంది. ఇటీవల రాజస్థాన్ సరిహద్దులో భారత యుద్ధ విమానాలు భీకర విన్యాసాలు చేయడంతో పాక్ గుండెలు దడ దడ లాడుతున్నాయి…

భారత్ తమపై యుద్ధం చేస్తే దీటుగా బదులిస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొనడం తెలిసిందే. భారత్ ఏ క్షణంలోనైనా విరుచుకుపడే అవకాశముందని భావించిన పాక్ ।। సరిహద్దులకు యుద్ధ ట్యాంకులను తరలిస్తోంది. బుధవారం పాక్ ఆర్మీకి చెందిన యుద్ధ ట్యాంకులు పదుల సంఖ్యలో సరిహద్దుకు చేరుకున్నాయి. భారత్ ఆర్మీ చర్యలకు దీటుగా స్పందించాలని గురువారం ఆర్మీకి సర్వాధికారాలూ అప్పగించాడు ఇమ్రాన్ ఖాన్. జాతీయ భద్రతా కమిటీ భేటీ తర్వాత ఈ మేరకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే అంతకు ఒకరోజు ముందే యుద్ధట్యాంకులను సరిహద్దుకు చేరవేశారు. దీంతో భారత్‌తో యుద్ధానికి పాక్ సర్వసన్నద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.గ