యువకుడి ఉన్మాదానికి పదో తరగతి విద్యార్దిని బలి…

Advertisement

ఓ యువకుడి ఉన్మాదానికి పదో తరగతి విద్యార్దిని బలైంది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్తాన్ నారాయణ్‌ పూర్‌ మండల కేంద్రంలో ఈ దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పొట్ట భవాని స్థానిక జిల్లా పరిషత్‌ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన గిరి అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించమని బాలిక వెంటపడుతున్నాడు. వేధింపులు భరించలేక యువతి నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది.

భవానిని గిర అనే యవకుడు స్కూలుకు వెళ్లే సమయంలో నిత్యం వెంటపడుతూ వేధిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ఓ సారి యువకుడిని హెచ్చరించినట్టు కూడా చెబుతున్నారు. అయినా మారకుండా అదేపనిగా బాలికను వేధిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన బాలిక శుక్రవారం బోనాల సందర్భంగా కుటుంబసభ్యులు గుడికి వెళ్లిన సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు గిరి ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here