కథలాపూర్ లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించాలంటూ ఓ యువకుడు వేధించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మండలంలోని దుంపెటకు చెందిన తోట హర్షిత (19) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై నాగేశ్వర్‌రావు కథనం ప్రకారం, కథలాపూర్‌ మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు హర్షితను వెంబడిస్తూ ప్రేమపేరుతో వేధిస్తున్నాడు.

డిగ్రీ చదువున్న హర్షితను రోజూ ఆ యువకుడు వేధిస్తుండడంతో తీవ్ర మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉదయం దూలానికి ఉరివేసుకుని బలవన్మరణం చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.