యువకుడు రన్నింగ్‌లో ఉన్న రైలు ఎక్కబోయి

  • Train.Accident

ఓ సాప్ట్‌వేర్ ఇంజినీరు రన్నింగ్‌లో ఉన్న రైలు ఎక్కబోయి కిందపడి మరణించిన విషాద ఘటన ముంబై నగరంలో వెలుగుచూసింది. మహారాష్ట్రలోని నాగ్పూర్ నగరానికి చెందిన సుదర్శన్ చౌదరి (31) ఇంజినీరింగ్ చదివి ముంబైలో పేయింగ్ గెస్ట్ గా ఉంటూ ఐబీఎంలో సాప్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేసేవాడు. సుదర్శన్ తన స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ కోసం కర్జత్ వెళ్లాలనుకున్నారు. సుదర్శన్ తెల్లవారుజామున 5.40 గంటలకు కర్జత్ రైలు ఎక్కేందుకు రాగా అప్పటికే ఆ రైలు బయలుదేరింది.

ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఉన్న సుదర్శన్ పరుగెత్తుకుంటూ ఫ్లాట్ ఫాం వద్దకు వచ్చి రన్నింగ్ లో ఉన్నరైలు ఎక్కబోయాడు. అంతే ప్రమాదవశాత్తూ కాలు జారి కిందపడ్డాడు. రైల్వే పోలీసులు సుదర్శన్ ను సియాన్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు చెప్పారు