యువతితో సహా బావిలో దూకిన ఉన్మాది

జనగాం జాఫర్‌గఢ్ మండలం ఉప్పగల్‌లో శనివారం సాయంత్రం ఓ ఉన్మాది బాలికతో సహా బావిలో దూకాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. రాజేశ్ (23) అనే వ్యక్తి బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో బాలికతో సహా ఉన్మాది బావిలో దూకాడు. బాలిక కేకలు విన్న స్థానికుల అక్కడికి చేరుకొని బాలిక, ఉన్మాదిని రక్షించారు. పోలీసులు ఉప్పగల్ కు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజేశ్ అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.

గ్రామంలో ఉండే మహిళ సంఘాలు నిందితుడికి కఠిన శిక్షలు వేయడంతో ఇలాంటి పునరావృతం కాకుండా చేయాలని పోలీసులను కోరారు.