పల్లావరం సమీపంలోని ఓ బ్యానర్‌ స్కూటర్‌పై వెళ్తున్న యువతిని బలికొంది. వివాహ ఆహ్వానం పేరిట ఏర్పాటు చేసిన ఆ బ్యానర్‌ నేలకొరిగి స్కూటర్‌పై పడడంతో అదుపు తప్పి ఆ యువతి కింద పడింది. అదే సమయంలో వెనుక వైపున వచ్చిన లారీ ఆమె మీదుగా వెళ్లడంతో మృతిచెందింది. గురువారం సాయంత్రం ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పల్లావరం రెడియల్‌ రోడ్డులో పళ్లికరణై వద్ద శుభశ్రీ అనే యువతి స్కూటర్‌ మీద వెళుతోంది. ఓ సంస్థలో పనిచేస్తున్న ఆమెను అక్కడ ఏర్పాటు చేసిన ఓ బ్యానర్‌ రూపంలో మృత్యువు కబళించింది.

Advertisement

అనుమతి లేకుండా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని హెచ్చరికలు, ఆదేశాలు ఇచ్చినా, వాటిని భేఖాతరు చేయడంతో ఓ నిండు ప్రాణం బలి అయింది. వివాహ ఆహ్వానం పేరిట మాజీ కౌన్సిలర్‌ ఒకరి కోసం ఏర్పాటు చేసిన ఈ బ్యానర్‌ నేలకొరిగింది. స్కూటర్‌ మీద బ్యానర్‌ పడడంతో అదుపు తప్పింది. స్కూటర్‌ నుంచి కింద పడ్డ శుభశ్రీపై వెనుక వైపున వచ్చిన వాటర్‌ ట్యాంకర్‌ వెళ్లింది. దీంతో సంఘటన స్థలంలోనే ఆమె మృతి చెందింది…