మైనర్‌ యువతిపై అత్యాచారం, గంజాయి కేసులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడింది మైనర్‌ యువకుడైనా , ఇందులో అతడి గ్యాంగ్ హస్తం ఉ‍న్నట్లు తేలింది. కొద్ది నెలల క్రితం దోమలగూడకు చెందిన 15 మంది అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఓ గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. గ్యాంగ్‌లో నాను అలియాస్ నరేష్‌, నాగరాజు, బాబా అలియాస్ అభిరామ్‌లు కీలకమైన వ్యక్తులు. ఆ యువకులు గ్యాంగ్‌లోని ఇద్దరు అమ్మాయిలకు గంజాయి అలవాటు చేశారు. నాను తండ్రి కారు డ్రైవర్ కాగా అభిరామ్ తండ్రి సుదర్శన్ ల్యాబ్ టెక్నీషియన్‌. సుదర్శన్‌కు స్థానికంగా ఉన్న ఓ కార్పోరేటర్ స్నేహితుడు. ఈ గ్యాంగ్‌కు అలీ అనే వ్యక్తి గంజాయ్ సప్లై చేస్తుంటాడు.

గంజాయి అమ్మాయిలకు తాగించి వారిపై గతంలో పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ‌వీడియోలు తీసీ బెదిరించిన సంఘటనలు కూడా ఉన్నాయి. గతంలో నాను, అభిరామ్‌లు కలిసి గ్యాంగ్ సభ్యుల్లో ఇద్దరికి కానిస్టేబుల్ వేషం వేయించారు. తరవాత గంజాయి సప్లై చేసిన అలీని బెదిరించి, అతని దగ్గరనుంచి రూ.18 వేలు తీసుకున్నారు‌. అలీ నారాయణ గూడ పోలీసులను ఆశ్రయించి వారిపై కేసు పెట్టాడు. ఆ తర్వాత సుదర్శన్‌ అతడి మిత్రుడైన కార్పోరేటర్ సహాయంతో కేసు మాఫీ చేయించాడు.