యువతి మాల్స్ లో సరుకులపై మూత్ర విసర్జన చేస్తుంది!. CCTV Video..

ఇప్పటి వరకు విమానాల్లో, షాపింగ్‌ మాల్స్‌లో వికృత చర్యలకు పాల్పడిన మగ వారి గురించే చదివాం. కానీ తాజాగా ఓ యువతి వీరందరిని తలదన్నే వికృతమైన చర్యకు పాల్పడింది. వాల్‌మార్ట్‌ మాల్‌కు వెళ్లిన ఓ యువతి.. అక్కడే ఉన్న ఆలుగడ్డలపై మూత్ర విసర్జన చేసింది. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా ప్రస్తుతం పోలీసులు ఈ వికార చర్యకు పాల్పడిన యువతి ఫోటోలను విడుదల చేశారు. ఈ సంఘటన పెన్సిల్వేనియా వాల్‌మార్ట్‌ స్టోర్‌లో జరిగింది. మాల్‌ సిబ్బందికి ఫ్లోర్‌లో ఎవరో మూత్రవిసర్జన చేసినట్లు అనుమానం రావడంతో.. సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించారు. దాంతో యువతి చేసిన చండాలం వెలుగు చూసింది.

ఈ సంఘటనపై మాల్‌ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. CCటీవీ ఫుటేజ్‌ ఆధారంగా సదరు యువతిని గ్రేస్‌గా గుర్తించారు పోలీసులు. అయితే ఆమెకు ఇలాంటి పనులు కొత్తేంకాదు అంటున్నారు పోలీసులు. పబ్లిక్‌ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించడం క్రమశిక్షణారాహిత్యం, అల్లర్లు సృష్టించడం వంటి కార్యక్రమాల్లో గ్రేస్‌ ఆరితేరిందంటున్నారు పోలీసులు. ఈ అంశాల్లో ఆమెపై పలు కేసులు కూడా నమోదయ్యాయని పేర్కొన్నారు. త్వరలోనే ఆమెను అరెస్ట్‌ చేస్తామని వెల్లడించారు. అయితే గ్రేస్‌ చర్యలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ‘థూ! నువ్వసలు మనిషివేనా, నీ లాంటి వారికి మరణశిక్ష విధించాలి’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here