మండలంలోని నమిలిగొండ గ్రామంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా కబడ్డీ టోర్నమెంట్స్ ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్య ముఖ్యఅథితిగా పాల్గొన్ని ప్రారంభించారు.

Advertisement

అనంతరం క్రీడా జ్యోతి వెలిగించి క్రీడా జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి సుమారుగా 50 టీమ్స్, 400 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్స్ లో పాల్గొంటున్నారని అన్నారు. నమిలిగొండ యూత్ ఆధ్వర్యంలో ప్రథమంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కబడ్డీ క్రీడలను గొప్పగా జరిపించాలని అన్నారు. ప్రో కబడ్డీ ద్వారా కబడ్డికి మంచి ఆదరణ లభించిందని గ్రామీణ స్థాయి నుండి ప్రపంచ స్థాయి వరకు కబడ్డిపై ప్రజలలో ఆసక్తి పెరిగిందని పేర్కొన్నారు. గెలిపు ఓటములు సహజమని మీలో ఉన్న ప్రతిభకు నిదర్శనం ఓటమి గెలుపుకు నాంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మారపాక రవి జడ్పీటీసీ & ఎస్ డబ్ల్యూఎస్సీ ఛైర్మన్, ఎంపీపీ కందుల రేఖగట్టయ్య, ఆకినేపల్లి బాలరాజు, సర్పంచ్ ఉప్పస్వామి, ఎంపీటీసీ రజాక్, తదితరులు పాల్గొన్నారు.