యోగాతో ఆరోగ్యం పదిలం జిల్లా SP కుమారి చందన దీప్తి IPS

యోగాతో ఆరోగ్యం పదిలం జిల్లా ఎస్.పి. కుమారి చందన దీప్తి ఐ.పి.ఎస్:

యోగ విద్య ఒక అద్భుతమైన ప్రక్రియగా అభివర్ణిస్తూ, మన భారతావని ప్రపంచానికి అందించిన ఆరోగ్య ఫలం యోగ అని పేర్కొన్నారు.

నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవడం వలన ఆరోగ్యంగా జీవించవచ్చని, ఇందులో ఎటువంటి సందేహం లేదని అన్నారు. యోగా వల్ల మనదేశానికి ప్రపంచంలో ఒక మంచి స్థానం వచ్చిందని, ఇది ప్రతీ భారతీయుడు గర్వపడే అంశం అని, యోగ వల్ల జరిగే లాభాలు గురించి వివరించారు.

పోలీసు శాఖ అనేది చురుకుదనానికి, శారీరక పటుత్వానికి పెట్టింది పేరు అని అన్నారు. యోగ వల్ల అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉ౦డవచ్చని , పోలీసులు ఆరోగ్యము, చురుకుదనంగా ఉండటమే కాకుండా మానసికంగా కూడా వత్తిడి ని జయించి ఆరోగ్యంగా ఉండవచ్చు అని సూచించారు.

ఈ కార్యక్రమ౦లో జిల్లా అదనపు యస్.పి. శ్రీ డి. నాగరాజు గారు, మెదక్ డి.ఎస్.పి. శ్రీ వెంకటేశ్వర్లు గారు జిల్లా సాయుద దళ డి.ఎస్.పి శ్రీ.మురళి గారు, సి.ఐ.లు మరియు ఎస్.ఐ లు ఆర్ఎస్ఐలు మరియు 200 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here