శుశ్రుత హత్య కేసులో నిందితులు చట్టం నుంచి తప్పించుకోలేరని MRPS‌ జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌ అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో రమేశ్ ఇంటి‌ ఎదుట శుశ్రుత బంధువులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. లక్ష్మణ్, మల్లేశ్‌ బుధవారం వారిని పరామర్శించారు. వారు మాట్లాడుతూ నిందితుడు రమేశ్‌ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అరెస్టు చేయాలని, హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ చేయించాలన్నారు. శుశ్రుత కుటుంబ సభ్యులను ఎర్రబెల్లి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ ఉష పరామర్శించి ఆర్థికసాయం చేశారు. పంచాయతీ కార్యాలయంలో సర్పంచి కొంరయ్య, వార్డు సభ్యులు శుశ్రుత మృతికి మౌనం పాటించారు. శుశ్రుత, ఆమె కుమారుడు, కుటుంబసభ్యులు శుశ్రుత చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య బాధితులను పరామర్శించారు….