ఉదయం హన్మకోండ పరిధిలోని కిషన్‌పుర ప్రాంతంలో జరిగిన విధ్యార్థిని రవళి పై పెట్రోల్‌ పోసి తగలబెట్టిన సంఘటనపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా. వి.రవీందర్‌ బుధవారం వివరాలు వివరాలను వెల్లడిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

సంగేం మండలం రాంచంద్రపురం గ్రామానికి చెందిన భాధితురాలు తోపుచర్ల రవళి మరియు దాడికి పాల్పడిన నిందితుడు పెండ్యాల సాయి అన్వేష్‌ వర్థన్నపేట మండలం చెన్నారం గ్రామానికి వాడు. ఇరువురు కుడా సంగేం మండలం రాంచంద్రపురం గ్రామంలో నాల్గవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఒకే పాఠశాలలో చదువుకోవడంతో ఇరువురు మధ్య స్నేహం కుదిరింది. పదవతరగతి అనంతరం ఇంటర్మీడియట్‌ చదువుకై ఇరువురు కూడా వరంగల్‌ నగరంలోని రెండు వెర్వేరు ఇంటర్‌ కళాశాలలో చేరారు. రవళీ, నిందితుడు అన్వేష్‌ ఇద్దరు ఇంటర్‌ చదువు పూర్తి చేయడంతో పాటు, బాధితురాలు రవళీ, నిందితుడు అన్వేష్‌ ఇద్దరు తిరిగి హన్మకోండ కిషన్‌పురలోని వాగ్దేవి డిగ్రీ కాలేజీలో చేరగా, ఇందులో నిందితుడు ఆన్వేష్‌ బి.కాం విభాగంలోను, భాధితురాలు రవళి బి.ఏస్సీలో చేరింది. రవళీ ఇదే ప్రాంతంలో వాగ్దేవి గర్ల్స్‌ హస్టల్‌లో నివావసం వుంటోంది. ప్రస్తుతం రవళీ, నిందితుడు అన్వేష్‌ ఇరువురు డిగ్రీ చివర సంవత్సరమ చదువుతున్నారు.

గత కోద్ది రోజులగా నిందితుడు పెండ్లి చేసుకోమని వెంటపడుతుండగా ఇందుకు రవళీ అంగీకరించకపోవడంతో, నిందితుడు ఈమెపై కక్షపెంచుకోని పథకం ప్రకారం ఈ రోజు ఉదయం తన బంధువు నుండి ద్వీచక్రవాహనాన్ని తీసుకోని ధర్మారం ప్రాంతంలోని పెట్రోల్‌పంపులో 70 రూపాయల పెట్రోల్‌ను ప్లాస్టిక్‌ సీసాలో తీసుకోని చివరిసారిగా రవళీతో మాట్లాడేందుకుగాను ఈ రోజు ఉదయం 9గంటల సమయంలో హస్టల్‌ నుండి బయటికి వచ్చిన రవళీతో కాలేజీకి పోయేమార్గంలో కోద్దిసేపు తనను పెళ్ళి చేసుకోవాలని వేధించడంతో ఇందుకు రవళీ అంగీకరించకపోవడంతో నిందితుడు అనుకున్న పథకం ప్రకారం తన వెంటతెచ్చుకున్న పెట్రోల్‌ను రవళీపై పోసి నిప్పంటించి సంఘటన స్థలం పారిపోవడంతో, అప్రత్తమైయిన హన్మకోండ పోలీసులు కెయూ-ములుగురోడ్డు లోని గొల్లపల్లి పెట్రోల్‌పంపు ప్రాంతంలో పోలీసులు నిందితుడు గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగిందని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

ఈ సంఘటనపై పోలీస్‌ కమీషనర్‌ స్పందింస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోజ ఉపేక్షించేది లేదని ఇలాంటి నిందితులు పాల్పడిన నేరాలను కోర్టులో నిరూపించి శిక్షపడే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడంతో పాటు, ముఖ్యంగా విధ్యార్థినులను ప్రేమపేరుతో ఏవరైనా వేధింపులకు గురిచేస్తున్న వాటి వెంటపడుతున్న సదరు విధ్యార్థునులు లేదా తల్లిదండ్రులు తక్షణమే పోలీసులకు సమాచారం అందించనచో ద్వారా వారిపై చట్టపరిధిలో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని. తద్వారా ఇలాంటి పునాతవృతం కాకుండ నియంత్రించవచ్చని పోలీస్‌ కమిషనర్‌ పెర్కోన్నారు.