అధికార తెరాస లో అసమ్మతి గుబులు

వరంగల్ జిల్ల స్టేషన్ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో తెరాస మూడు గ్రూపులుగా మారింది. ఇక్కడ సిట్టింగ్ అభ్యర్ది తాటికొండ రాజయ్యకు తెలంగాణ రాష్ట్ర సమితి టిక్కెట్టు కేటాయించింది. ఆయనకు టిక్కెట్టు ఇవ్వదంటూ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వర్గీయులు ఆందోళన చేపట్టారు. వారిని హైదారబాద్ పంపించి వారితో పాటు కడియం శ్రీహరితోను మంత్రి కేటీఆర్ చర్చలు జరిపారు. మంత్రి సమక్షంలో చర్చలు ఫలించాయి.

Advertisement

అయితే నియోజకవర్గానికి వెళ్లిన అనంతరం అసమ్మతి నేతలు పోరుబాట పట్టారు. వీరికి తోడు మూడో అభ్యర్ది రంగంలోకి వచ్చారు. అతనే రాజరావు ప్రతాప్. ఈయన గులాబి కండువా కప్పుకుని కెసిఆర్ ఫోటో పెట్టుకొని నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. రాజయ్యను, కడియం శ్రీహరిని కాదని తననే గెలిపించాలంటూ ప్రచారాన్ని హోరెత్తిన్తున్నారు.

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఈ మూడు ముక్కలాట రసకంగాయంలో పడింది.

అందరు ఒక్కటయి తెరాస అభ్యర్థి ని గెలిపిస్తారా ?? లేక ఎవరి దారి వారు చూసుకుంటారా?? చూడాలి కాలం ఎలా సమాధానం చెబుతుందో ..