*రాజయ్య నా తమ్ముడు – చేసిన చిన్న, చిన్న తప్పులు క్షమించండి*

*నియోజక వర్గాన్ని బ్రహ్మండంగా అభివృద్ధి చేసే బాధ్యత నాది*

*నియోజక వర్గంలో ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటా*

స్టేషన్ ఘన్పూర్ లో గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్

శ్రీహరి అభిమానులయితే రాజయ్య గెలుపు కోసం కృషి చేయాలి..లేకపోతే నాకు అపఖ్యాతి

గత మూడేళ్లుగా ఘన్పూర్ లో జరిగిన నష్టం భర్తీ చేసే బాధ్యత నాది

అన్నదమ్ముల వలె కలిసి పనిచేస్తాం…అభివృద్ధి చేసి చూపిస్తాం

ప్రతి ఎకరానికి రెండు పంటలకు నీరిచ్చే విధంగా బాధ్యత తీసుకుంటా

నాడు తెలంగాణకు అడ్డుపడిన వారు…నేడు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారు

టీడీపీ తెలంగాణ ద్రోహుల పార్టీ అని చెప్పి ఎలా పొత్తుకు సిద్ధమయ్యారో కోదండరామ్ చెప్పాలి

కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ ఆ పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటుంది?

అవకాశవాద రాజకీయాల కోసమే మహాకూటమి…అది దగా కూటమి..ప్రజలను మోసం చేసే కూటమి

తెలంగాణ రాజకీయాల్లో కేసిఆర్ బాహుబలి…ఆయనను ఒంటరిగా ఎదుర్కోలేక కూటమి ఏర్పాటు

స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

మంత్రి కేటిఆర్ సాక్షిగా చెబుతున్నా…నేను, డాక్టర్ రాజయ్య, పల్లా రాజేశ్వర్ రెడ్డి ముగ్గురం కలిసి స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తామని , గతంలో జరిగినట్లు ఇక జరగదని ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉద్వేగంతో చెప్పారు. ఈసారి ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. రాజయ్య, నేను అన్నదమ్ముల వలె కలిసి పనిచేస్తామన్నారు. రాజయ్య తప్పు చేసి ఉంటే ఆయన తరపున క్షమించమని కోరుతున్నాను అన్నారు. స్టేషన్ ఘన్పూర్ లో కడియం శ్రీహరిని నిజంగా అభిమానిస్తే రాజయ్య గెలుపు కోసం కృషి చేయాలన్నారు. లేకపోతే తనకు అపఖ్యాతి వస్తుందని చెప్పారు. సిఎం కేసిఆర్ తనపై అమితమైన నమ్మకంతో ఎంపీగా ఉన్నతనను ఉప ముఖ్యమంత్రిని చేశారన్నారు.

దరిద్రపు గొట్టు కాంగ్రెస్ ను ఊరిపొలిమెర్లకు తరిమి కొట్టాలి- ఆపద్ధర్మ మంత్రి కేటిఆర్

ఇకపై తప్పులు జరగకుండా చూసుకుంటా…అభ్యర్థి డాక్టర్ రాజయ్య

తెలిసీ, తెలియక గతంలో నావల్ల తప్పులు జరిగితే నన్ను క్షమించాలని, ఇకపై నావల్ల తప్పులు జరగకుండా చూసుకుంటానని స్టేషన్ ఘన్పూర్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు వందకు వంద శాతం నన్ను ఆశీర్వదించినందుకు హృదయపూర్వకంగా పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. శ్రీహరిగారి సహకారంతో నియోజక వర్గాన్ని మెండుగా ముందుకు వెళ్లేలా అభివృద్ధి చేస్తానన్నారు.

స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గం ఏడు రిజర్వాయర్లతో తులతూగుతుందని, ఈ అభివృద్ధికి శ్రీకారం చుట్టంది శ్రీహరిగారేనని అభ్యర్థి డాక్టర్ రాజయ్య అన్నారు.